18 ఏళ్ల తర్వాత మళ్లీ రమణ గోగుల!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

18 ఏళ్ల తర్వాత మళ్లీ రమణ గోగుల!

Ramana Gogula joins with Venky Mama after 18 years
  • వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో 'సంక్రాంతికి వస్తున్నాం'
  • ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్
  • రమణ గోగులతో పాడిస్తున్నామన్న చిత్రబృందం
  • 2006లో లక్ష్మీ చిత్రం కోసం వెంకీ మామాతో కలిసి పనిచేసిన రమణ గోగుల
విక్టరీ వెంకటేశ్, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియో అప్ డేట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియా, గీత రచయిత భాస్కరభట్ల కనిపిస్తారు.  

ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశామని, అయితే రెగ్యులర్ సింగర్లతో కాకుండా, ప్రత్యేకమైన గాత్రం కలిగిన సింగర్ (రమణ గోగుల)తో పాడిస్తే బాగుంటుందని అనిల్ రావిపూడి చెప్పగా... ఆయన వస్తాడా? అని భీమ్స్ సందేహం వ్యక్తం చేయగా.... వెంటపడితే వస్తాడు అని అనిల్ రావిపూడి బదులిచ్చాడు. 

వెంటనే భీమ్స్ సిసిరోలియో తన ఫోన్ నుంచి వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగులకు ఫోన్ చేయడం, రమణ గోగుల కార్లో రికార్డింగ్ స్టూడియోకు రావడం ఈ వీడియోలో చూడొచ్చు. 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలోని ఆ స్పెషల్ సాంగ్ ను రమణ గోగుల ఆలపించినట్టు కూడా చిత్రబృందం తమ వీడియోలో చూపించింది. 

రమణ గోగుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమంటే ఇదేరా, తమ్ముడు, బద్రి, యువరాజు, జానీ, లక్ష్మీ, అన్నవరం, యోగి వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఇక, వెంకటేశ్ తో రమణగోగుల చేసిన 'లక్ష్మీ' చిత్రం కూడా మ్యూజికల్ హిట్టయింది. ఈ చిత్రం 2006లో వచ్చింది.

మళ్లీ ఇన్నాళ్లకు, అంటే 18 ఏళ్ల తర్వాత వెంకీ మామా, రమణ గోగుల ఓ చిత్రానికి పనిచేస్తున్నారు. దీని గురించి చిత్రబృందం ప్రత్యేకంగా ప్రస్తావించింది. భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ ట్యూన్ ఇచ్చాడని, ఈ స్పెషల్ సాంగ్ ను వెరీ స్పెషల్ సింగర్ రమణ గోగుల ఆలపిస్తున్నాడని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తన ట్వీట్ లో వెల్లడించింది. త్వరలోనే తమ చిత్రం నుంచి మొదటి సింగిల్ రిలీజ్ కానుందని తెలిపింది. 

రమణ గోగుల మంచి మ్యూజిక్ డైరెక్టరే కాదు, మంచి సింగర్ కూడా. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కు ఆయన పాడిన పాటలు అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపేశాయి.
Advertisement
Ramana Gogula
Sankrantiki Vastunnam
Venky Mama
Anil Ravipudi
Bheems Ceciroleo
Sri Venkateswara Creations

More Telugu News