ఉద్యోగులపై మళ్లీ వేటుకు సిద్ధమైన ఫేస్బుక్ మాతృసంస్థ మెటా
- ఇప్పటికే రెండు దఫాలుగా 21 వేల మందిని ఇంటికి పంపిన మెటా
- దీర్ఘకాలిక వ్యూహాల పేరుతో మరోమారు ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం
- ఈ ఏడాది ఆగస్టు నాటికి రోడ్డున పడిన 1.36 లక్షల మంది ఉద్యోగులు
మెటా తన నిర్ణయాన్ని అమలు చేస్తే కనుక రిక్రూటింగ్, లీగల్ ఆపరేషన్, డిజైన్.. ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారిపై ప్రభావం పడే అవకాశం ఉంది. మెటా 2022లో 11 వేల మంది ఉద్యోగులను తొలగించింది. నిరుడు మరో 10 వేల మందిపై వేటేసింది. ఇప్పుడు మరికొందరిపై వేటుకు రంగం సిద్ధం చేసినట్టు వార్తలు వస్తుండగా, ఇప్పటికే తొలగింపునకు గురైన కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా, ఈ ఏడాది ఆగస్టు నాటికి 422 కంపెనీలు 1.36 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి.