Teegala Krishna Reddy: టీడీపీలోకి తీగ‌ల కృష్ణారెడ్డి

Teegala Krishna Reddy  Joins TDP
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్ లోని చంద్ర‌బాబు నివాసంలో ఆయ‌న్ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తీగ‌ల కృష్ణారెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 

తాను టీడీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీఆర్ఎస్ పార్టీలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్‌తో త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంద‌ని గుర్తు చేసిన ఆయ‌న‌... హైద‌రాబాద్ అభివృద్ధి చేసింది వంద‌కు వంద‌శాతం చంద్ర‌బాబేన‌ని అన్నారు. తెలంగాణ‌లో టీడీపీ పాల‌న మ‌ళ్లీ రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు.   

ఇక చంద్ర‌బాబును క‌లిసిన మ‌ల్లారెడ్డి త‌న‌ మ‌న‌వ‌రాలు శ్రేయ‌రెడ్డి పెళ్లికి సీఎంను ఆహ్వానించారు. గ‌తంలో మ‌ల్లారెడ్డి, మాధ‌వ‌రం కృష్ణారావు, తీగ‌ల కృష్ణారెడ్డి టీడీపీలో ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. కానీ, ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో టీడీపీని వీడారు. మ‌ల్లారెడ్డి మ‌న‌వ‌రాలు పెళ్లి కార‌ణంగా చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు టీడీపీ అధినేత‌ను క‌లిశారు.
Go Back to Shorts
Teegala Krishna Reddy
BRS
TDP
Chandrababu

More Telugu News