పవన్ పై మరోసారి ప్రకాశ్ రాజ్ సెటైర్లు
- ఉదయనిధి స్టాలిన్ ను మెచ్చుకుంటూ పవన్ కల్యాణ్ పై పరోక్షంగా విమర్శలు
- సనాతన ధర్మం విషయంలో ఇటీవల ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుబట్టిన పవన్ కల్యాణ్
- చెన్నైలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో తమిళనాడు సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసిన ప్రకాశ్ రాజ్
తమది సమానత్వమని, తాను ప్రశ్నిస్తే భయపడుతున్నారని అన్నారు. అయితే, తాను ఎన్నటికీ బలహీన వర్గాల తరఫునే మాట్లాడతానని, ప్రశ్నిస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. కాగా, తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, ప్రకాశ్ రాజ్ కు మధ్య ట్విట్టర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రకాశ్ రాజ్ చెన్నైలో చేసిన వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించినవేనని పవన్ అభిమానులు మండిపడుతున్నారు.