భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత.. సచిన్, గవాస్కర్‌కు సాధ్యంకాని ఫీట్‌ను అందుకున్న సర్ఫరాజ్ ఖాన్
- ఇరానీ కప్‌లో ముంబయి తరఫున తొలి ద్విశతకం నమోదు చేసిన సర్ఫరాజ్
- 42 సార్లు రంజీ ఛాంపియన్ అయిన ముంబయికి ఇప్పటివరకూ ఇరానీ కప్‌లో నో డబుల్ సెంచరీ
- తొలి డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్
ఇక ఇరానీ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఇతర జట్లకు చెందిన వసీం జాఫర్ (విదర్భ), రవిశాస్త్రి , ప్రవీణ్ అమ్రే, యశస్వి జైస్వాల్ (రెస్ట్ ఆఫ్ ఇండియా) మాత్రమే డబుల్ సెంచరీలు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో సర్ఫరాజ్ ఖాన్ చేరాడు.
ఇదిలాఉంటే.. సర్ఫరాజ్ అజేయ ద్విశతకంలో 25 బౌండరీలు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అలాగే 80 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు సాధించాడు. ఇది అతని 15వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. మరోవైపు ముంబయి కెప్టెన్ అజింక్యా రహానే కూడా త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. 97 రన్స్ చేసి ఔటయ్యాడు. దీంతో 40వ ఫస్ట్ క్లాస్ సెంచరీని కోల్పోయాడు.