సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటున్న మెగాస్టార్‌ సినిమా!

Megastar movie leaving Sankranti race
  • చిరంజీవి విశ్వంభర సినిమా వాయిదా 
  • పెండింగ్‌లో విఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ 
  • త్వరలో అధికారిక ప్రకటన
తెలుగు సినిమాకు అత్యంత ముఖ్యమైన సీజన్‌ సంక్రాంతి. ప్రతి హీరో తమ సినిమా సంక్రాంతి రేసులో వుండటానికి ప్రయత్నిస్తుంటాడు. అందుకే ప్రతి సంవత్సరం సంక్రాంతి పోటీ గట్టిగానే వుంటుంది. అయితే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రేసులో వుంది. జనవరి 10న సంక్రాంతి పర్వదినాన ఈ సినిమాను విడుదల చేస్తున్నామని ప్రకటించారు మేకర్స్‌. అయితే తాజా సమాచారం ప్రకారం విశ్వంభర సంక్రాంతి రేసులో వుండటం లేదని వార్తలు వస్తున్నాయి. 

సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ పెండింగ్‌లో వుండటంతో పాటు విశ్వంభర ఓటీటీ డీల్‌ కూడా ఇంకా పూర్తికాకపోవడంతో మేకర్స్‌ ఈ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించాలనే ఆలోచనలో వున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్‌, ఆషికా రంగనాథన్‌  కథానాయికలుగా నటిస్తున్నారు. కునాల్‌కపూర్‌, రమ్య పసుపులేటి ఈష చావ్లా ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విశ్వంభరకు స్వరాలు అందిస్తున్నారు. 
Go Back to Shorts
Vishwambhara
Chiranjeevi
Megastar Chiranjeevi
Uv creations
Trisha
Tollywood

More Telugu News