చంద్రబాబును రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలుస్తున్నారంటూ వార్తలు.. అసలు నిజం ఇదే!
- సీఎం రిలీఫ్ ఫండ్ కు చరణ్, తారక్ విరాళాలు
- చెక్ అందించేందుకు చంద్రబాబును ఈరోజు కలుస్తున్నారంటూ వార్తలు
- ఈ వార్తల్లో నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చిన చరణ్ టీమ్
అయితే, ఈ వార్తల్లో నిజం లేదని రామ్ చరణ్ పీఆర్ టీమ్ తెలిపింది. చరణ్ తన వ్యక్తిగత పర్యటనలో ఉన్నారని... చంద్రబాబును ఈరోజు ఆయన కలవడం లేదని స్పష్టం చేసింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈరోజున చంద్రబాబును కలవడం లేదని తెలుస్తోంది. తారక్ తన తాజా చిత్రం 'దేవర' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.