వైసీపీ మునిగిపోయిన నావ.. జగన్ చేతులారా చేసుకున్నాడు: గంటా శ్రీనివాసరావు
- టీడీపీ గేట్లు ఎత్తేస్తే వైసీపీ ఖాళీ అవుతుందన్న గంటా
- మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వీడుతారని వ్యాఖ్య
- ఇప్పటికీ జగన్ లో మార్పు లేదని విమర్శ
వైసీపీకి ఈ పరిస్థితి రావడానికి ఆ పార్టీ అధినేత జగనే కారణమని గంటా చెప్పారు. త్వరలోనే మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వీడుతారని జోస్యం చెప్పారు. ఇంత జరుగుతున్నా జగన్ లో ఎలాంటి మార్పు లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్ తన తీరును, వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే... వచ్చే ఎన్నికల తర్వాతైనా ఆయనకు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంటుందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని ఆయన చెల్లెలు షర్మిలే చెప్పారని అన్నారు.