మమతా బెనర్జీపై అనుచిత పోస్ట్.. బీకాం స్టూడెంట్ అరెస్టు
- పశ్చిమ బెంగాల్ సీఎంపై సోషల్ మీడియాలో పోస్టు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన టీఎంసీ కార్యకర్తలు
- డిగ్రీ విద్యార్థిని అరెస్టు చేసిన కోల్ కతా పోలీసులు
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. క్రితిసోషల్ అనే ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్ లో మమతా బెనర్జీ దాడిని రెచ్చగొట్టేలా కామెంట్లు ఉన్నాయి. ఇందిరా గాంధీ హత్య తరహాలోనే మమతా బెనర్జీపైనా కాల్పులు జరపాలని, ఒకవేళ ఈ ప్రయత్నంలో విఫలమైనా తానేమీ నిరుత్సాహపడబోనని సదరు స్టూడెంట్ రాసుకొచ్చాడు. అంతేకాదు, ఈ నెల 9న కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో హత్యాచారానికి గురైన బాధితురాలి పేరు, ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. దీంతో సీఎంపై హత్యాయత్నానికి, అల్లర్లకు రెచ్చగొట్టడం, అత్యాచార బాధితురాలి వివరాలను బయటపెట్టడం తదితర నేరాల కింద స్టూడెంట్ ను అరెస్టు చేసినట్లు కోల్ కతా పోలీసులు తెలిపారు.