Actor Vikram: విజయవాడ బాబాయ్ హోటల్‌లో ‘తంగలాన్’ మూవీ టీం.. అభిమానులతో విక్రమ్, మాళవిక మోహనన్ ముచ్చట్లు

Actors Vikram And Malavika Mohanan Have Tiffin In Vijayawada Babai Hotel
షార్ట్స్‌లో చూడండి
తమిళ స్టార్ నటుడు విక్రమ్ విజయవాడలోని బాబాయ్ హోటల్‌లో ఈ ఉదయం సందడి చేశాడు. ఆయన నటించిన హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ మూవీ తంగలాన్ ఈ నెల 15న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా బృందం విజయవాడలో సందడి చేసింది. 

ఈ సందర్భంగా వారంతా బాబాయ్ హోటల్‌లో టిఫిన్ చేసి సందడి చేశారు. నాయకానాయికలు విక్రమ్, మాళవిక మోహన్ హోటల్‌కు వచ్చిన వారితో సరదాగా ముచ్చటించారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు. కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల్లోని కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. పా రంజిత్ దీనికి దర్శకుడు. 

ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఏ సినిమా కోసమూ ఇంతగా కష్టపడలేదని పేర్కొన్నాడు. భిన్నమైన ఈ కథలో గ్లామర్‌కు అస్సలు చోటులేదన్నాడు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు మరో ప్రపంచంలో విహరిస్తారని పేర్కొన్నాడు. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని తెలిపాడు. కాగా, మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ, గుంటూరులో ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశాలు నిర్వహిస్తారు.
Go Back to Shorts
Actor Vikram
Malavika Mohanan
Thangalaan
Vijayawada
Babai Hotel

More Telugu News