లోన్ యాప్స్, హనీట్రాప్ ఊబిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: వంగలపూడి అనిత
- సైబర్ నేరాలపై అవగాహన కోసం విజయవాడలో వాకథాన్
- దేశంలో సైబర్ నేరాలు 24 శాతం వరకు పెరిగాయన్న అనిత
- ప్రజలు అందిస్తున్న వ్యక్తిగత సమాచారమే మోసాలకు కారణమవుతుందని హెచ్చరిక
నాలుగు నెలల్లోనే దేశవ్యాప్తంగా రూ.1,730 కోట్ల సైబర్ నేరాలు జరిగాయన్నారు. నిత్యం వినియోగించే అనేక యాప్స్ ద్వారా భారీ మోసాలు జరుగుతున్నాయన్నారు. సోషల్ మీడియాకు, యాప్‌లకు ప్రజలు అందిస్తున్న వ్యక్తిగత సమాచారమే ఈ మోసాలకు కారణమవుతుందన్నారు. అందుకే మోసపూరిత యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి జిల్లాలోనూ సైబర్ సెల్ చురుగ్గా పని చేయాలని సూచించారు.