నా స్నేహితుడు పవన్ కల్యాణ్‌ రియ‌ల్ భార‌తీయుడు.. ప్ర‌స్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్‌.. సీఎంగా మీరే చేయాలి: ఎస్‌జే సూర్య

SJ Surya about Pawan Kalyan Deputy CM of Andhra Pradesh
  • శంకర్, క‌మ‌ల్ హాస‌న్ కాంబోలో భారతీయుడు-2
  • ఆదివారం హైదరాబాద్‌లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌
  • ఈ ఈవెంట్‌కు హాజ‌రైన నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య 
  • ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ కల్యాణ్‌పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంకర్, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కాంబోలో వ‌స్తున్న మూవీ 'భారతీయుడు-2'. 1996లో వ‌చ్చిన 'భార‌తీయుడి'కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. జులై 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. దీంతో చిత్రం యూనిట్ ప్ర‌చార కార్యక్ర‌మాల‌ను ముమ్మ‌రం చేసింది. దీనిలో భాగంగా మూవీ యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వ‌హించింది. 

ఈ సంద‌ర్భంగా భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌రైన‌ నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న‌ మాట్లాడుతూ.. "హీరో కమల్ చెప్పారు ఎవరైతే ప్రేమతో భార‌త‌దేశం మంచి కోసం పని చేస్తారో వాళ్లంతా భార‌తీయులేన‌ని. మీ అందరిలో ఇండియన్ ఉన్నారు. అలాంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ పవన్ కల్యాణ్  ఉన్నారు. ఏదో ఒక రోజు 'ఆంధ్రప్రదేశ్ సీఎం నా స్నేహితుడు' అని గర్వంగా చెప్పుకుంటాను అని మూడేళ్ల‌ క్రితం చెప్పా. ఇప్పుడు సగం పూర్తయింది. మిగతాది మీరే పూర్తిచేయాలి" అని సూర్య అన్నారు. 

ఆయ‌న మాట్లాడిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌ ఈ వీడియోను షేర్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. కాగా, ఎస్‌జే సూర్య దర్శకత్వంలో పవన్ ఖుషి, కొమురం పులి చిత్రాలు చేసిన విష‌యం తెలిసిందే.
Advertisement
SJ Surya
Pawan Kalyan
Deputy CM of AP
Andhra Pradesh

More Telugu News