New countries: ఈ మధ్యే పుట్టిన కొత్త కొత్త దేశాలేవో తెలుసా?

top 10 newest countries in the world
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచవ్యాప్తంగా అంతర్యుద్ధాలు, స్వేచ్ఛ, సమానత్వం కోరుకునే ప్రాంతాల్లో తిరుగుబాట్లతో కొత్త కొత్త దేశాలు ఏర్పడుతూ ఉన్నాయి. నిజానికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతి 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పరాయి పాలన నుంచి విముక్తి పొంది కొత్త దేశాలుగా ఏర్పడ్డాయి. అనంతరం కూడా వివిధ పరిస్థితులతో కొత్త దేశాలు పుడుతున్నాయి. అందులోనూ ఆఫ్రికా, యూరప్ ఖండాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. అలా ఈ మధ్య పుట్టిన కొత్త దేశాలేవంటే..

  • సూడాన్ దేశం ఎన్నో దశాబ్దాల పాటు కొనసాగిన అంతర్యుద్ధంతో.. 2011 జులై 9న దక్షిణ సూడాన్ ఏర్పాటైంది.
  • సెర్బియా దేశం నుంచి 2008 ఫిబ్రవరి 17న కొసావో స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. అయితే దానికి ఇంకా ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాల్సి ఉంది.
  • మొదట్లో సెర్బియా అండ్ మాంటెనెగ్రో యూనియన్ ఆఫ్ స్టేట్ గా ఉండేవి. 2006లో జరిగిన రెఫరెండం ద్వారా మాంటెనెగ్రో, సెర్బియా రెండూ కొత్త దేశాలుగా ఏర్పాటయ్యాయి.
  • ఇండో నేషియా నుంచి 2002 మే 20న ఈస్ట్ తైమూర్ స్వాతంత్ర్యం పొంది కొత్త దేశంగా ఏర్పాటైంది.
  • అమెరికా వలస స్థావరంగా ఉన్న పలావ్.. 1994 అక్టోబర్ 1న ప్రత్యేక దేశంగా స్వాతంత్ర్యం పొందింది.
  • ఇథియోపియాలో జరిగిన అంతర్యుద్ధం పర్యవసానంగా 1993 మే 24న ఎరిత్రియా కొత్త దేశంగా ఏర్పాటైంది.
  • చెకొస్లోవేకియా 1993 జనవరి 1న రెండు దేశాలుగా విడిపోయింది. చెక్ రిపబ్లిక్, స్లోవేకియా కొత్త దేశాలుగా ఏర్పడ్డాయి.
  • 1991 జూన్ 25న క్రొయేషియా కూడా స్వతంత్ర దేశంగా ఏర్పడింది.
Go Back to Shorts
New countries
world news
offbeat

More Telugu News