ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు కనిపించిన ఘటన.. చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ
- ఐస్‌క్రీమ్ తయారీదారు లైసెన్స్‌ను సస్పెండ్ చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ
- పూణేలోని ఐస్‌క్రీమ్ తయారీ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం చర్యలు
- ఇంకా పెండింగ్‌లోనే ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్
నిర్ఘాంత పరుస్తున్న ఈ ఘటనపై తదుపరి విచారణ కోసం కంపెనీ ప్రాంగణంలో నమూనాలను సేకరించినట్టు అధికారులు తెలిపారు. ముంబై నగరంలోని కంపెనీ ప్రాంగణాన్ని కూడా తనిఖీ చేశామని, బ్యాచ్ నమూనాలను సేకరించామని వివరించారు.
కాగా ఇటీవల ముంబై నగరంలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే. 26 ఏళ్ల ఓ వైద్యుడు ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీం కోన్ ఆర్డర్ చేశాడు. కానీ దానిని ఓపెన్ చేసి చూడగా అందులో మనిషి వేలు ఉన్నట్టు గుర్తించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఇంకా పెండింగ్‌లో ఉంది.