అదే జరిగితే జూన్ 5న నేను తీహార్ జైలు నుంచి విడుదలవుతా: అరవింద్ కేజ్రీవాల్
- కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే మెజార్టీ వస్తే జైలు నుంచి విడుదలవుతానని వ్యాఖ్య
- తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలో తనను అవమానించేందుకు ప్రయత్నించారని ఆవేదన
- తన సెల్‌లో ఉన్న రెండు సీసీటీవీ కెమెరాలను 13 మంది అధికారులు నిరంతరం పర్యవేక్షించేవారని వెల్లడి
తన సెల్‌లో ఉన్న రెండు సీసీటీవీ కెమెరాలను 13 మంది అధికారులు నిరంతరం పర్యవేక్షించేవారని తెలిపారు. ఆ ఫుటేజీని ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా పంపించారని ఆరోపించారు. తనపై మోదీకి అంత అక్కసు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ప్రజలు ఎంతో గౌరవంగా చూస్తున్నారన్నారు. బీజేపీ మాత్రం ప్రజల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు.