ఆదివారం తెరుచుకోనున్న బ్యాంకులు.. యథావిధిగా సేవలు!
- ఆదివారంతో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం
- ప్రభుత్వ లావాదేవీలకు ఆటంకం కాకుండా సేవలు
- అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీచేసిన ఆర్బీఐ
ఆర్బీఐ ఆదేశాలతో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సహా 20 ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకు డీబీఎస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లు ఆదివారం సెలవు దినమైనప్పటికీ సాధారణంగానే పనిచేస్తాయి. నెఫ్ట్, ఆర్టీజీఎస్‌తోపాటు చెక్ క్లియరెన్స్ వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయి.