సజ్జలపై ఏపీ సీఈవోకు ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు

Atchannaidu complains against Sajjala to AP CEO
  • సజ్జల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ సీఈవోకు లేఖ రాసిన అచ్చెన్నాయుడు
  • ప్రెస్ మీట్లు పెట్టి విపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని వెల్లడి
  • ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉంటూ వైసీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని ఆగ్రహం
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గీత దాటుతున్నారంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉంటూ సజ్జల రాజకీయ నేతలా మాట్లాడుతున్నారంటూ ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.

సజ్జల ఓ వైసీపీ కార్యకర్తలా విపక్షాలపై విషం చిమ్ముతున్నారని వివరించారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విపక్షాలపై ఆరోపణలు చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సజ్జలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు సీఈవోకు లేఖ రాశారు.
Go Back to Shorts
Atchannaidu
Sajjala Ramakrishna Reddy
AP CEO
Election Code
TDP
YSRCP

More Telugu News