తెలంగాణ ఇన్‌చార్జ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్.. తెలంగాణ గవర్నర్లు అందరూ తమిళులే!
- రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదె
- హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
- ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణన్
తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ పనిచేసిన నేపథ్యంలో రాధాకృష్ణన్‌కు కూడా ఆ బాధ్యతలు అప్పగించారు. కాగా, రాధాకృష్ణన్ గతేడాది ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ గతంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు నియమితులైన గవర్నర్లు అందరూ తమిళనాడు వారే కావడం గమనార్హం.