స్కిల్ కేసు.. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ
- స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన హైకోర్టు
- అధికారులను, దర్యాప్తు సంస్థను చంద్రబాబు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని ప్రభుత్వం పిటిషన్
- ప్రభుత్వ ఆరోపణలకు సమాధానాలు ఇస్తామన్న చంద్రబాబు తరపు న్యాయవాది
ప్రభుత్వం పేర్కొన్న ఆరోపణలపై తాము సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్టు చంద్రబాబు తరపు న్యాయవాది హరీశ్ సాల్వే గత విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. గత విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తన వాదనలను వినిపిస్తూ... చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన తర్వాత పలు పరిణామాలు చోటు చేసుకున్నాయని... అధికారులను, దర్యాప్తు సంస్థను చంద్రబాబు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని చెప్పారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపున రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, మూడు వారాలకు తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఈనాటి విచారణ సందర్భంగా కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.