ఓటర్ల కోసం ఎన్నికల కమిషన్ కొత్త యాప్
- అభ్యర్థుల నేర చరిత్ర వివరాలతో తీసుకొచ్చిన ఈసీ
- ‘కేవైసీ’ పేరుతో లాంచ్ చేసిన సీఈసీ రాజీవ్ కుమార్
- అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని వెల్లడి
‘నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ)’ పేరుతో ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారులతో పాటు ఐఓఎస్ వినియోగదారులకూ ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రతీ ఓటరుకు తన నియోజకవర్గంలో పోటీపడుతున్న అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థుల నేర చరిత్ర వివరాలు తెలుసుకుంటే ఎవరికి ఓటేయాలనే దానిపై ఓటర్ కు స్పష్టత వస్తుందని, సరైన అభ్యర్థిని ఎన్నుకునే వీలు కలుగుతుందని వివరించారు.