నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు!
- నేటి మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ అధ్యక్షతన భేటీ
- జీరోవడ్డీ రుణాలకు నిధుల కేటాయింపు
- నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం
- మరింత పకడ్బందీగా రైతు భరోసా
- ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏపైనా నిర్ణయం
- నేటి సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ మహిళా సదస్సు
కోదండరాం, ఆమిర్ అలీఖాన్ పేర్లు మరోమారు గవర్నర్ చెంతకు
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ ఆమిర్ అలీఖాన్ పేర్లను మరోమారు గవర్నర్ ఆమోదం కోసం పంపడంతోపాటు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు వంటి అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలపైనా నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, నేటి సాయంత్రం నాలుగున్నర గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం భారీ మహిళా సదస్సు నిర్వహిస్తోంది. ఇందులో మహిళలకు జీరో వడ్డీ, స్వయం సహాయక సంఘాలకు బీమా కల్పన వంటి వాటిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.