సీనియర్ భామలను కలవర పెడుతున్న త్రిష!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీనియర్ భామలను కలవర పెడుతున్న త్రిష!

Trisha Special
  • పాతికేళ్ల కెరియర్ చూసిన త్రిష 
  • తరగని అందంతో పెరిగిన క్రేజ్ 
  • సౌత్ లో మళ్లీ బిజీ అవుతున్న బ్యూటీ 
  • 'విశ్వంభర'లో ప్రధాన కథానాయిక ఆమెనే

అందంగా ఉండటం వేరు ... అందాల కథానాయిక అనిపించుకోవడం వేరు. అందంగా ఉన్నవాళ్లంతా కథానాయికలుగా ఏలేస్తారనే గ్యారంటీ లేదు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే అందంతో పాటు అభినయం .. అందుకు అవసరమైన అదృష్టం ఉండాల్సిందే. ఎంత గ్లామరస్ గా కనిపించినా హీరోయిన్ గా తెరపై కనిపించేది కొంతకాలమే అనేది అందరికీ తెలిసిందే. అయితే కెరియర్ మొదలెట్టి పాతికేళ్లు అవుతున్నా స్టార్ డమ్ తగ్గకపోవడం త్రిష లాంటి కొంతమంది విషయంలోనే జరుగుతుంది. త్రిష తెలుగు .. తమిళ భాషల్లో ఏక కాలంలో స్టార్ డమ్ తెచ్చుకుంది. అక్కడా .. ఇక్కడా కూడా స్టార్ హీరోలతో కలిసి తెరపై సందడి చేసింది. భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో తమిళంలో ఆమె నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళ్లడం మొదలుపెట్టింది. '96' .. 'రాంగి' .. 'ది రోడ్ వంటి సినిమాలు అలా వచ్చినవే. లేడీ ఓరియెంటెడ్ కథలను చేతులో పట్టుకున్న మేకర్స్ కి ఆమె నయనతార తరువాత ఛాయిస్ గా మారింది. 

అలాంటి త్రిషకి 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో ఛాన్స్ వచ్చింది. అటు ఆ సినిమాలోను .. ఆ సినిమా వేడుకలలోను త్రిష గ్లామర్ చూసి షాక్ కానివారంటూ లేరు. తెరపై ఆమె ముత్యంలా మెరిసింది .. ముద్దబంతిలా విరిసింది. అప్పటి నుంచి అంతా ఆమె గ్లామర్ గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. వివిధ భాషలలోని సీనియర్ స్టార్స్ సినిమాల నుంచి ఆమెను సంప్రదించడం మొదలైంది. ప్రస్తుతం ఆమె తమిళ .. మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి .. బాలకృష్ణ సినిమాల వైపు నుంచి త్రిషతో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. నిన్ననే ఆమె 'విశ్వంభర' సినిమా షూటింగులో జాయిన్ అయింది.  'స్టాలిన్' తరువాత ఇంతకాలానికి ఆమె చిరూ జోడీగా ఛాన్స్ దక్కించుకోవడం నిజంగా విశేషమే. ఇక బాలకృష్ణ .. వెంకటేశ్ .. నాగార్జున వంటి స్టార్స్ సరసన కూడా ఆమె మెరిసే అవకాశం లేకపోలేదు. మొత్తానికి త్రిష తన గ్లామర్ తో మిగతా సీనియర్ భామలను కలవరపెడుతోందనే అనుకోవాలి. 

Advertisement
Trisha
Chiranjeevi
Vishwambhara

More Telugu News