ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా వైఫల్యం.. గోడదూకి రన్‌వేపైకి దూసుకొచ్చిన మందుబాబు
- రిపబ్లిక్ రోజునే ఘటన
- రాత్రి 11.30 గంటల సమయంలో రన్‌వేపై మందుబాబును గుర్తించిన ఎయిర్ ఇండియా పైలట్
- హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన సీఐఎస్ఎఫ్
రన్‌వేపైకి దూసుకొచ్చిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో రన్‌వేపైకి వచ్చిన నిందితుడిని ఎయిర్ ఇండియా పైలట్ గుర్తించి ఏటీసీకి సమాచారం అందించాడు. ఏటీసీ ఆ విషయాన్ని సీఐఎస్ఎఫ్‌కి తెలియజేసింది. నిందితుడిది హర్యానాగా గుర్తించిన సీఐఎస్ఎఫ్ అధికారులు అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.