పార్లమెంటు భద్రత ఉల్లంఘన కేసు.. రాజస్థాన్‌లో దొరికిన కాలిపోయిన ఫోన్ భాగాలు, నిందితుల దుస్తులు
- నిన్న ఆరో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించిన కోర్టు
- నిందితులకు పాస్‌లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌సింహను విచారించనున్న అధికారులు
- మీడియా దృష్టిని ఆకర్షించేందుకు తొలుత నిప్పు పెట్టుకోవాలని భావించిన నిందితులు
- ఆపై ఆ ప్లాన్‌ను పక్కనపెట్టి పొగ డబ్బాలతో చాంబర్‌లోకి
పార్లమెంటు భద్రతా ఉల్లంఘన నిందితులకు సంబంధించిన కాలిపోయిన మొబైల్ ఫోన్లు, దుస్తులు, బూట్లను శనివారం పోలీసులు రాజస్థాన్‌లో గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ ఝా నిందితులందరి ఫోన్లు తీసుకుని తొలుత వాటిని పగలగొట్టాడు. ఆ తర్వాత కాల్చివేశాడు.
మీడియా దృష్టిని ఆకర్షించేందుకు నిందితులు తమనుతాము గాయపరుచుకోకుండా జాగ్రత్త పడుతూ తమ శరీరాలపై అగ్ని నిరోధక జెల్‌ను పూసుకుని నిప్పంటించుకోవడం, లేదంటే కరపత్రాలను విసరడం వంటివి చేయాలనుకున్నారు. అయితే, ఆ తర్వాత వారు ఆ ఆలోచనను విరమించుకుని పొగ డబ్బాలతో లోక్‌సభ చాంబర్‌లోకి దూకాలని నిర్ణయానికి వచ్చి అదే అమలు చేసినట్టు విచారణాధికారులు తెలిపారు.