రేపు నాగచైతన్య 'తండేల్' ఓపెనింగ్... ముఖ్య అతిథులుగా వెంకటేశ్, నాగార్జున
- నాగచైతన్య, సాయిపల్లవి జంటగా 'తండేల్'
- చందూ మొండేటి దర్శకత్వంలో చిత్రం
- డిసెంబరు 9న ముహూర్తం షాట్
- అన్నపూర్ణ స్టూడియోస్ లోని గ్లాస్ హౌస్ లో కార్యక్రమం
హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లోని గ్లాస్ హౌస్ లో ఉదయం 10.30 గంటలకు ముహూర్తం షాట్ చిత్రీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.
'తండేల్' చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.