‘బచ్చల మల్లి’గా అల్లరి నరేశ్.. పూజా కార్యక్రమాలు షురూ!

Allari Nareshs next titled Bachchala Malli
  • వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తున్న అల్లరి నరేశ్
  • ఉదయం ప్రారంభమైన కొత్త సినిమా పూజా కార్యక్రమాలు
  • అమాయకుడిగా కనిపించనున్న కామెడీ స్టార్
కామెడీ ట్రాక్ నుంచి బయటకు వచ్చి సీరియస్ పాత్రలు చేస్తూ తనలోని నటుడిని బయటకు తెస్తున్న అల్లరి నరేశ్ ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘ఉగ్రం’ వంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు. సీరియస్ పాత్రల్లోనూ అలవోకగా ఇమిడిపోగలనని నిరూపించాడు. ఈసారి ‘బచ్చల మల్లి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సుబ్బు మంగదేవి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమం ఈ ఉదయం 10.26 గంటలకు జరిగింది. నరేశ్‌కు ఇది 63వ సినిమా. పూజా కార్యక్రమం సందర్భంగా మేకర్స్ ఈ మూవీ టైటిల్‌ను విడుదల చేశారు. ‘బచ్చల మల్లి’లో అల్లరి నరేశ్ అమాయకుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Bachhala Malli
Allari Naresh
Subbu Cinema
Balaji Gutta
Rajesh Danda

More Telugu News