ఢిల్లీ కాలుష్యం అంతా హైదరాబాద్‌ను కమ్మేసింది: మంత్రి హరీశ్ రావు వ్యంగ్యం
- ఢిల్లీ కాలుష్యాన్ని మరో మూడు రోజులు భరించాల్సి ఉంటుందని వ్యాఖ్య
- ఢిల్లీ నుంచి వస్తున్న నేతలు మూడు రోజుల తర్వాత కనిపించరన్న హరీశ్ రావు
- ఇప్పుడు నేను వెళ్త బిడ్డో సర్కార్ దవాఖానకు అని పాడుకుంటున్నారన్న మంత్రి
బీఆర్ఎస్ మూడోసారి కచ్చితంగా గెలుస్తుందని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ కరెంట్ కోతలు తప్పవని హెచ్చరించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందో గమనించాలన్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు పాడుకునే వారమని, ఇప్పుడు నేను వెళ్త బిడ్డా సర్కారు దవాఖానాకు అని పాడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిచాక పేదలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.