తమిళ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ వనిత విజయ్ కుమార్ పై దాడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ వనిత విజయ్ కుమార్ పై దాడి

Late Night Attack On Artist Vanitha Vinay Kumar
  • శనివారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి
  • బిగ్ బాస్ సీజన్ 7 లో రచ్చ.. ప్రదీప్ ఎలిమినేషన్ పై వివాదం
  • ప్రదీప్ సానుభూతిపరుడే తనపై దాడిచేశాడన్న వనిత
తమిళ బిగ్ బాస్ సీజన్ 7 లో రచ్చ రచ్చ జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న గొడవల ప్రభావం బయట కూడా కనిపిస్తోంది. ఈ సీజన్ లో పార్టిసిపెంట్ చేసి, ఇటీవల ఎలిమినేట్ అయిన వనిత విజయ్ కుమార్ పై శనివారం రాత్రి దాడి జరిగింది. విజయ్ కుమార్ కూతురు, నటుడు అరుణ్ కుమార్ సోదరే ఈ వనిత.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక యూట్యూబ్ లో రివ్యూ ఇస్తోంది. శనివారం రాత్రి కూడా ఇలాగే రివ్యూ ఇచ్చి, డిన్నర్ చేసి ఇంటికి వెళ్లడానికి బయటకు వచ్చింది.

స్టూడియోకు దగ్గర్లో పార్క్ చేసిన తన కారు వద్దకు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఒకరు సడెన్ గా ఎదురొచ్చి వనితపై దాడి చేశాడు. దీంతో వనిత ముఖంపై గాయమైంది. ఈ విషయాన్ని వనిత సోషల్ మీడియాలో పంచుకుంది. తనపై ప్రదీప్ ఆంటోని సానుభూతిపరుడే దాడి చేశాడని ఆరోపిస్తోంది. ప్రదీప్ కు రెడ్ కార్డ్ ఇస్తావా అంటూ ఆగంతుకుడు తనపై దాడికి పాల్పడ్డాడని పేర్కొంది.

బిగ్ బాస్ 7 సీజన్ లో భాగంగా హౌస్ లోకి ఎంటరైన కంటెస్టెంట్లలో ప్రదీప్ ఆంటోని ఒకరు.. ఇటీవల ప్రదీప్ ను రెడ్ కార్డ్ తో కమల్ హాసన్ బయటకు పంపించాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రదీప్ కు మద్దతుగా ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ప్రదీప్ ను తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రదీప్ ఎలిమినేషన్ విషయంలో తనపై కోపం పెంచుకున్న ఓ అభిమానే ఈ దాడికి పాల్పడ్డట్లు వనిత ఆరోపిస్తోంది. అయితే, వనిత ట్వీట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని కొందరు సూచిస్తుండగా.. ఇదంతా అబద్ధమని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.
Advertisement
Bigboss
vanitha vijay kumar
Tamil Bigboss
pradeep antoni
big boss 7
attack on vanitha

More Telugu News