ప్రజలకు సేవచేసే రఘునందన్ రావును గెలిపించండి: దుబ్బాకలో మంద కృష్ణ మాదిగ
- ఎవరు సరైన వారో నిర్ణయించుకొని ఓటు వేయాలని సూచించిన మంద కృష్ణ
- సామాజిక న్యాయం అంటే కేసీఆర్‌కు, కాంగ్రెస్ పార్టీకి నచ్చదని విమర్శలు
- నరేంద్రమోదీతో మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుందని వ్యాఖ్య
అయితే మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి చట్టసభల్లోకి పంపుతానని చెప్పిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదే అన్నారు. మహిళల కోసం రాజీనామా చేసింది అంబేడ్కర్ అయితే... వారికి రిజర్వేషన్లు మోదీ ఘనత అన్నారు. సామాజిక న్యాయం అనే మాట వింటే కేసీఆర్‌కు, కాంగ్రెస్ పార్టీకి నచ్చదని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీతో మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. సేవ చేసే రఘునందన్ రావును గెలిపించి అభివృద్ధి పనులు చేసుకోవాలని సూచించారు.