ఓటేసే ముందు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయాలి.. ఈసీకి సరికొత్త విజ్ఞప్తి
- మద్యం మత్తులో ఓటేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చూడాలని డిమాండ్
- ఎలక్షన్ కమిషన్ కు డ్రంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ వినతి
ఐదేళ్ల భవిష్యత్తును ఓటర్లు మద్యం మత్తులో నాశనం చేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ కింగ్స్ ఆఫ్ డ్రంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. నవంబర్ 30న ప్రతి పోలింగ్ స్టేషన్ బయట బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ వినతి పత్రం గురించి తెలిసినపుడు తొలుత ఆశ్చర్యపోయినా తర్వాత ఆలోచింపజేసేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వినతిపత్రం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఓటు అనే ఆయుధాన్ని మద్యం మత్తులో వృథా చేసుకోవద్దని సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతుందని అంటున్నారు.
.