Tirumala: ఈ నెల 12న తిరుమలలో బ్రేక్ దర్శనాల రద్దు

Break Darshans on November 12 cancelled in Tirumala
షార్ట్స్‌లో చూడండి
తిరుమలలో దీపావళి సందర్భంగా ఈ నెల 12న బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఆ రోజున శ్రీవారి సన్నిధిలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. కేవలం ప్రోటోకాల్ దర్శనాలను మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపింది. నవంబరు 11న ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. దీపావళి సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఆస్థాన స్వామికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద సమర్పణతో దీపావళి ఆస్థానం ముగియనుంది.
Go Back to Shorts
Tirumala
Deepavali
Asthanam
Break Darshans
TTD

More Telugu News