కూకట్‌పల్లి, కొత్తగూడెం సహా 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జనసేన
- పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లు కేటాయించిన బీజేపీ
- కూకట్‌పల్లి నుంచి బరిలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
- కొత్తగూడెం నుంచి పోటీ చేయనున్న లక్కినేని సురేందర్ రావు
జనసేన పోటీ చేసే స్థానాలు... అభ్యర్థులు...
కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు - నేమూరి శంకర్ గౌడ్, కోదాడ - మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు - వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం - మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం - లక్కినేని సురేందర్ రావు, వైరా (ఎస్టీ) - డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట (ఎస్టీ) - ముయబోయిన ఉమాదేవి పోటీ చేయనున్నారు.