ఇలాంటి పాకిస్థాన్ టీమ్ తో మేము ఎప్పుడూ ఆడలేదు: గంగూలీ సంచలన వ్యాఖ్యలు
- అహ్మదాబాద్ మ్యాచ్ లో ఇండియా చేతిలో చిత్తుగా ఓడిన పాక్ జట్టు
- తాము ఆడే రోజుల్లో పాక్ జట్టు చాలా బలంగా ఉండేదని కితాబు
- బాబర్, రిజ్వాన్ బ్యాటింగ్ లో కూడా కసి కనిపించలేదని విమర్శ
పాకిస్థాన్ జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ... తాము ఆడే రోజుల్లో పాకిస్థాన్ టీమ్ ఇలా ఉండేది కాదని చెప్పారు. వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలింగ్ తో పాటు పటిష్ఠమైన బ్యాటింగ్ ఆర్డర్ తో పాక్ జట్టు చాలా బలంగా ఉండేదని అన్నారు. ఇప్పుడున్నటువంటి పాక్ జట్టుతో తాము ఏరోజూ ఆడలేదని చెప్పారు. ప్రస్తుత పాక్ జట్టు పేపర్ మీద మాత్రమే పటిష్ఠంగా కనిపిస్తోందని అన్నారు. పాక్ బ్యాట్స్ మెన్లు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. ఇలాంటి జట్టుతో వరల్డ్ కప్ లో పాక్ నెట్టుకు రావడం కష్టమేనని అన్నారు. పాక్ స్టార్ బ్యాట్స్ మెన్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ల బ్యాటింగ్ లో కూడా తనకు కసి కనిపించలేదని... టెక్నిక్ తెలియనట్టు, భయపడుతూ ఆడుతున్నట్టే అనిపించిందని చెప్పారు.