లైవ్ డిబేట్‌లో ఒకరినొకరు కొట్టుకున్న పాకిస్థాన్ రాజకీయ నాయకులు
- పీటీఐ న్యాయవాది షేర్ అప్ఝల్ మార్వత్, పీఎంఎల్-ఎన్ సెనేటర్ అఫ్నానుల్లా ఖాన్ పరస్పర దాడి
- ఒకరినొకరు చెంపలు వాయించుకున్న వైనం
- వారిద్దరిని విడదీసిన టీవీ ఛానల్ సిబ్బంది
పీటీఐ న్యాయవాది మార్వాత్ తొలుత పీఎంఎల్-ఎన్ సెనేటర్ ఖాన్ పై దాడి చేశారు. దీంతో ఖాన్ అతనిని నెట్టివేయడంతో పరస్పరం దెబ్బలాడుకున్నారు. టీవీ సిబ్బంది వారిని విడదీశారు. అఫ్నానుల్లా ఖాన్ ఈ సంఘటనపై ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. పీటీఐ నాయకుడికి తాను గట్టిగా బుద్ధి చెప్పానని, ఇది ఆ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు కూడా గుణపాఠంగా మారుతుందన్నారు.