త్రిష 'ది రోడ్' నుంచి రానున్న అప్ డేట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రిష 'ది రోడ్' నుంచి రానున్న అప్ డేట్!

Trisha
  • త్రిష ప్రధానమైన పాత్రధారిగా 'ది రోడ్'
  • యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన సినిమా 
  • దర్శకత్వం వహించిన వశీగరన్ 
  • అక్టోబర్ 6వ తేదీన సినిమా విడుదల
త్రిష ఒక వైపున సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూనే, మరో వైపున లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. అలా ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే 'ది రోడ్'. చాలా కాలం క్రితం 'మధురై'లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. 

ఈ సినిమాలో త్రిష జర్నలిస్టుగా .. ఏడేళ్ల బిడ్డకి తల్లిగా కనిపించనుంది. కథా పరంగా చెప్పాలంటే ఇది ఒక రివేంజ్ స్టోరీ. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. రేపు ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. అరుణ్ వశీగరన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

అక్టోబర్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వెల్ రామ్మూర్తి .. మియా జార్జ్ .. ఎమ్మెస్ భాస్కర్ ... వివేక్ ప్రసన్న .. షాబీర్ .. సంతోష్ ప్రతాప్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమిళంతో పాటు ఇతర భాషల్లోను విడుదలవుతున్న ఈ సినిమా, ఏ స్థాయి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి. 

Advertisement
Trisha
Vashigaran
The Road

More Telugu News