చంద్రబాబును సోమవారం వరకు సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దన్న హైకోర్టు.. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరిన చంద్రబాబు లాయర్ లూథ్రా
- చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొదన్న ఏఏజీ పొన్నవోలు
- ఇరువైపు వాదనలను పూర్తిగా వినాల్సి ఉందన్న హైకోర్టు
చంద్రబాబుపై విచారణ ప్రాథమిక దశలో ఉందని ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ఏఏజీ పొన్నవోలు కోర్టును కోరారు. ఈ క్రమంలో ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఇరువైపుల వాదనలను పూర్తిగా వినాల్సి ఉందని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని పొన్నవోలు కోరారు. దీంతో, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తున్నామని, ఆలోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది. అయితే సీఐడీ కస్టడీకి చంద్రబాబును ఇవ్వొద్దని కోర్టును లూథ్రా కోరారు. ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు... వచ్చే సోమవారం వరకు చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది.