Suman: చిరంజీవి అన్నదాంట్లో తప్పేముంది.. మీరే బజ్జీగాళ్లు!: సుమన్ ఫైర్

What is wrong in Chiranjeevi comments asks Suman
షార్ట్స్‌లో చూడండి
సినిమాలతో రాజకీయ నాయకులకు ఏం పని అని సినీ నటుడు సుమన్ ప్రశ్నించారు. సినీ నటుల రెమ్యునరేషన్లపై మాట్లాడటాన్ని రాజకీయ నాయకులు మానేయాలని సూచించారు. మా పారితోషికాలతో రాజకీయాలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు పకోడీగాళ్లు కాదని, తమను విమర్శించిన రాజకీయ నాయకులే బజ్జీగాళ్లు అని విమర్శించారు. సినిమా వాళ్లపై వ్యక్తిగత విమర్శలు సరికాదని అన్నారు. రాజకీయ నాయకుల గురించి ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన రాజకీయ నాయకులకు సినిమాలతో పనేముందని అన్నారు. 

సూపర్ స్టార్ రజనీకాంత్ ను కూడా టార్గెట్ చేస్తూ ఇటీవల కొందరు మాట్లాడటం తనకు బాధను కలిగించిందని సుమన్ అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే రజనీపై ఎందుకు బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారు రాజకీయాలు చేయకూడదని ఎక్కడైనా చట్టం ఉందా? అని ప్రశ్నించారు. కొన్ని కారణాల వల్ల వైవాహిక జీవితాలు విచ్ఛిన్నం అవుతాయని, అలాంటప్పుడు మరో వివాహం చేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకొచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని పవన్ మాజీ భార్యలు మిమ్మల్ని అడిగారా? అని నిలదీశారు. పవన్ ను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప, వ్యక్తిగతంగా దూషించడం సరికాదని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తి అని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని అన్నారు. 
Go Back to Shorts
Suman
Chiranjeevi
Tollywood
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam
Rajinikanth

More Telugu News