మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: దుర్గాదేవి విగ్రహంతో వెళుతున్న ఏడుగురు భక్తుల దుర్మరణం
- మహారాష్ట్ర సమృద్ధి హైవేపై ఘటన
- దుర్గాదేవి విగ్రహంతో వెళ్తున్న టెంపోను ఢీకొట్టిన ట్రక్కు
- 18 మందికి పైగా తీవ్ర గాయాలు
- ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గామాత విగ్రహంతో వెళ్తున్న భక్తుల టెంపోను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, 18 మందికి పైగా గాయపడ్డారు.
షేగావ్ నుంచి వార్దాకు దుర్గాదేవి విగ్రహాన్ని తరలించేందుకు భక్తులు ఒక టెంపో పికప్‌లో ప్రయాణిస్తున్నారు. సమృద్ధి హైవేపై ధమన్‌గావ్ రైల్వే సమీపంలోని ఛానల్ 97 వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. టెంపోకు వెనుక ట్రాలీ అమర్చి ఉండటం, వాహనం నెమ్మదిగా వెళ్తుండటంతో.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు డ్రైవర్ అదుపుతప్పి ఢీకొట్టాడు.
ప్రమాద తీవ్రతకు టెంపో వెనుక భాగం, ట్రాలీ పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను వెంటనే వార్దాలోని ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
గాయపడిన వారిలో 12 మందికి తీవ్ర గాయాలు కాగా, ఆరుగురికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.