Ram Charan: బాలయ్య పట్ల గౌరవాభిమానాలు ప్రదర్శించిన రామ్ చరణ్... వీడియో ఇదిగో!

Ram Charan wishes Balakrishna in Brahmanandam son marriage function
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్, డాక్టర్ ఐశ్వర్యల వివాహం హైదరాబాదులో గత రాత్రి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

కాగా, ఈ వివాహానికి నందమూరి బాలకృష్ణ కూడా విచ్చేశారు. బాలయ్య రాకతో పెళ్లి వేదిక వద్ద భారీ కోలాహలం నెలకొంది. అంతమంది జనం లోంచి రామ్ చరణ్ ముందుకొచ్చి బాలకృష్ణను గౌరవంగా పలకరించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బాలయ్య ఆప్యాయంగా చరణ్ భుజం తట్టారు.

బాలయ్యకు నమస్కరించిన రామ్ చరణ్... ఈ సందర్భంగా తన అర్ధాంగి ఉపాసనను కూడా ఆయనకు పరిచేయం చేశారు. ఉపాసన తనకంటే చిన్నదైనప్పటికీ బాలయ్య ఆమెకు రెండు చేతులు జోడించి నమస్కరించి ఓ మహిళ పట్ల తన సంస్కారం చాటారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Go Back to Shorts
Ram Charan
Balakrishna
Upasana
Brahmanandam
Siddharth
Wedding
Hyderabad
Tollywood

More Telugu News