అమరావతి రైతులతో నారా లోకేశ్ ముఖాముఖి... హాజరైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
- తాడికొండ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
- అమరావతి ఆవేదన పేరిట రైతులతో లోకేశ్ భేటీ
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలు
- ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేసిన వైసీపీ అధిష్ఠానం
- టీడీపీకి దగ్గరవుతున్న ఉండవల్లి శ్రీదేవి
ఉండవల్లి శ్రీదేవి గత కొంతకాలంగా టీడీపీ వర్గాలకు సన్నిహితంగా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై వైసీపీ అధినాయకత్వం సస్పెండ్ చేసినవారిలో ఉండవల్లి శ్రీదేవి కూడా ఉన్నారు. ఇవాళ ఆమె నారా లోకేశ్ కార్యక్రమానికి హాజరవడంతో వచ్చే ఎన్నికల్లో ఆమె ఏ పక్షమో స్పష్టమైంది.