ఇకపై నిన్ను 'లోఫర్ నారాయణ' అని పిలుస్తాం: జనసేన తెలంగాణ అధ్యక్షుడి హెచ్చరిక
- పవన్ కల్యాణ్ ను విమర్శిస్తే ఇకపై ఊరుకోబోమన్న శంకర్ గౌడ్
- ఇన్నాళ్లూ నారాయణ వయసుకు గౌరవం ఇచ్చామని వ్యాఖ్య
- జనసేన అధినేతను విమర్శించే నైతిక అర్హత లేదని ఆగ్రహం
‘ఇన్నాళ్లు నీ వయసుకి గౌరవం ఇచ్చాం. ఇకపై నిన్ను లోఫర్ నారాయణ అని పిలుస్తాం జాగ్రత్త. రాజకీయ బ్రోకర్, లోఫర్ వి నువ్వు అని తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. మా నాయకుడిని విమర్శించే కనీస నైతిక అర్హత నీకు లేదు. ఇంకోసారి మా అధినేత పవన్ కల్యాణ్ గారిపై నోరు జారితే బుద్ధి చెప్తాం జాగ్రత్త’ అని శంకర్ గౌడ్ ట్వీట్ చేశారు.