రాయలసీమ రైతుల తల రాతలు మారబోతున్నాయి: పవన్ కల్యాణ్
Advertisement

రాయలసీమ రైతుల తల రాతలు మారబోతున్నాయి: పవన్ కల్యాణ్

Pawan Kalyan says Rayalaseema farmers fate is about to change
  • రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు అంకురార్పణ
  • మదనపల్లెలో శంకుస్థాపన చేసిన నిర్మలా సీతారామన్, చంద్రబాబు
  • రైతులకు సాంకేతికతను అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్న పవన్
రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యాన కేంద్రంగా (గ్లోబల్ హార్టికల్చర్ హబ్) తీర్చిదిద్దే ప్రాజెక్టుకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. మదనపల్లెలో 'రాయలసీమ రైజింగ్' పేరుతో చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... రూ. లక్ష కోట్ల పెట్టుబడితో చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో రాయలసీమ రైతుల తలరాతలు మారబోతున్నాయని, ఇది ఒక చరిత్రాత్మక ఘట్టమని అన్నారు. కష్టపడి పనిచేసే సీమ రైతులకు ప్రభుత్వం అండగా నిలిచి, సాంకేతికతను అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని కొనియాడారు. హార్టికల్చర్ హబ్‌తో పాటు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు కూడా పునాదిరాయి వేశామన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా సీమలోని కరవు పీడిత ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగును గణనీయంగా పెంచుతామని, సూక్ష్మ సేద్యం ద్వారా నీటి సంరక్షణకు పెద్దపీట వేస్తామని పవన్ తెలిపారు. రైతులు పండించే నాణ్యమైన పంటలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మెగా ప్రాజెక్టులతో రాయలసీమ జిల్లాల్లోని లక్షలాది మంది రైతులకు స్థిరమైన ఆర్థిక భద్రత లభిస్తుందని... ఈ ప్రాజెక్టు దేశ వ్యవసాయ రంగంలోనే ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
Pawan Kalyan
Rayalaseema Rising
Global Horticulture Hub
Chandrababu Naidu
Nirmala Sitharaman
Andhra Pradesh Agriculture

More Telugu News