డంపర్ ట్రక్కును ఢీకొట్టి ఇరుక్కుపోయిన కారు.. డ్రైవర్ ఉండగానే రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డంపర్ డ్రైవర్.. వీడియో ఇదిగో!

డంపర్ ట్రక్కును ఢీకొట్టి ఇరుక్కుపోయిన కారు.. డ్రైవర్ ఉండగానే రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డంపర్ డ్రైవర్.. వీడియో ఇదిగో!

truck drove the vehicle for about 2 kms dragging a car that got stuck beneath truck
  • కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఘటన
  • ట్రక్కును వెనక నుంచి ఢీకొట్టి ఇరుక్కుపోయిన కారు
  • వేగం పెంచుతూ దూసుకెళ్లిన డంపర్ డ్రైవర్
  • చేజ్ చేసి ట్రక్కును ఆపి కారు డ్రైవర్‌ను రక్షించిన మరో కారు డ్రైవర్
కర్ణాటకలోని ఉదుపిలో దారుణం జరిగింది. సాగర నుంచి మంగళూరు వెళ్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న డంపర్ ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు ముందుభాగం డంపర్ వెనక ఇరుక్కుపోయింది. గమనించిన ట్రక్ డ్రైవర్ వాహనాన్ని ఆపాల్సింది పోయి వేగం మరింత పెంచాడు. చిక్కుకున్న కారులో డ్రైవర్ ఉండగానే ట్రక్ డ్రైవర్ దాదాపు రెండు కిలోమీటర్ల పాటు కారును ఈడ్చుకెళ్లాడు. 

అదే రూట్‌లో వెళ్తున్న ఓ కారు డ్రైవర్ దీనిని గమనించి ట్రక్‌ను వెంబడిస్తూ డ్రైవర్‌ను ఆపాలని కోరినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో మరింత వేగం పెంచి వాహనానికి కారు అడ్డం పెట్టడంతో ట్రక్ డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. ఆ తర్వాత కారు డ్రైవర్‌ను రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Viral Video
Karnataka
Udupi
Car Accident

More Telugu News