Jogi Ramesh: వీధికుక్కలు మొరుగుతాయ్.. పట్టించుకోవద్దు: జోగి రమేశ్

Jogi Ramesh hot comments on Pawan Kalyan
  • పవన్ పిచ్చికుక్కతో సమానమని ఘాటు వ్యాఖ్య
  • సైతాన్, భూతం, దెయ్యం అంటూ ముగ్గురిపై ఆగ్రహం
  • బాబు హయాంలో జరిగిన గంజాయిని జగన్ అరికడుతున్నారని వెల్లడి

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పవన్ పిచ్చి కుక్కతో సమానమని ఘాటుగా విమర్శలు గుప్పించారు. వీధి కుక్కలు మొరుగుతాయని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఒకరు సైతాన్, ఒకరు భూతం.. ఇంకొకరు దెయ్యం అంటూ చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లను ఉద్దేశించి జోగి రమేశ్ వ్యాఖ్యలు చేశారు.

మనం పురాణాల్లో ఇలాంటి వారిని చూశామని, మన తాతలు చెబుతుంటే విన్నామని, కానీ ఇప్పుడు ఆ దెయ్యాలను ప్రత్యక్షంగా చూస్తున్నామని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ముగ్గురు నిష్టదరిద్రులైన వెధవలు అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గంజాయి స్మగ్లింగ్ జరగలేదా? అని నిలదీశారు. టీడీపీ హయాంలో మీరు చేసిన పాపాలను, మీరు చేసిన దుర్మార్గాలను ఈ రోజు జగన్ శుభ్రం చేస్తున్నారన్నారు. గంజాయిని అరికడుతున్నారన్నారు.

రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, పవన్, లోకేశ్ లను జనం తరిమికొడతారన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఎవరితోను పొత్తు ఉండదని, సింగిల్ గానే వెళతామని చెప్పారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్ల కోసం బీసీల జపం చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News