తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

Moderate Rains Expected Today And Tomorrow In Telangana
  • పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో రాష్ట్రం పైకి గాలులు
  • నిన్న హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం
  • అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 4.3 సెంటీమీటర్ల వాన
తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు పేర్కొంది.  నిన్న కూడా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. 

ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్య పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 4.3 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా లక్ష్మీనగర్‌, ములుగు జిల్లా మల్లంపల్లిలో 3.8 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు.
Advertisement
Rains
Hyderabad
Telangana

More Telugu News