కేన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసిన నటదర్శకుడు మంగళ్ ధిల్లాన్
- సుదీర్ఘకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న మంగళ్ ధిల్లాన్
- లుధియానా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- 2017లో చివరిసారి ‘తూఫాన్ సింగ్’ సినిమాలో కనిపించిన నటుడు
1986లో టీవీ షో ‘కథాసాగర్’ ద్వారా ఇండస్ట్రీలోకి అడగుపెట్టారు. ఆ తర్వాత తిరుగన్నదే లేకుండా పలు షోలలో ఆయన కనిపించారు. ‘ఖూన్ భారీ మాంగ్’, ‘జక్మి ఔరత్’, ‘ట్రైన్ టు పాకిస్థాన్’ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. చివరిసారి 2017లో వచ్చిన ‘తూఫాన్ సింగ్’లో మంగళ్ ధిల్లాన్ కనిపించారు. ఆయన మరణవార్తతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయనకు సంతాపం ప్రకటిస్తూ పలువురు నటీనటులు ట్వీట్లు చేస్తున్నారు.