టీడీపీ వస్తే చేనేతపై 5 శాతం జీఎస్టీ ఎత్తివేస్తాం: లోకేశ్
- జమ్మలమడుగు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర
- దేవగుడి క్యాంప్ సైట్ వద్ద చేనేత కార్మికులతో సమావేశం
- ప్రభుత్వం నుంచి సహకారం అందడంలేదన్న కార్మికులు
- అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటామన్న లోకేశ్
ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటామని ప్రకటించారు. టీడీపీ వచ్చాక చేనేతపై 5 శాతం జీఎస్టీ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. నేత కార్మికులకు టిడ్కో ఇళ్లు, వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మగ్గం ఉన్న కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తామని లోకేశ్ వెల్లడించారు. చంద్రన్న బీమా పథకాన్ని మళ్లీ ప్రవేశపెడతామని చెప్పారు.