తుప్పు పట్టిన సైకిల్ ను చంద్రబాబు, లోకేశ్ తొక్కలేకపోతున్నారు: అంబటి రాంబాబు
- ఎన్టీఆర్ బతికుంటే చంద్రబాబు బతుకు బజారుపాలు అయ్యేదన్న అంబటి
- టీడీపీకి ఇదే చివరి మహానాడు అని వ్యాఖ్య
- ప్రతి హామీని అమలు చేసిన ఘనత జగన్ దని ప్రశంస
తుప్పు పట్టిన సైకిల్ ను చంద్రబాబు, నారా లోకేశ్ తొక్కలేకపోతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. టీడీపీకి ఇదే చివరి మహానాడు అని చెప్పారు. టీడీపీ బతకడం కష్టమని, వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కనుమరుగు అవుతుందని అన్నారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎప్పుడైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేసిన ఘనత జగన్ దని అన్నారు. చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పారు.