హీరో ఉదయ్ కిరణ్ మరణంపై దర్శకుడు తేజ సంచలన కామెంట్స్
- తన తాజా మూవీ ‘అహింస’ ప్రమోషన్స్‌లో తేజ సంచలన వ్యాఖ్య
- ఉదయ్ కిరణ్ మరణంపై తొలుత తేజను ప్రశ్నించిన యాంకర్
- అతడి డెత్ మిస్టరీ గురించి తెలిసినా కొందరు ఏమీ తెలియనట్టు నటిస్తున్నారన్న తేజ
ఉదయ్ కిరణ్‌ను తేజ వెండితెరకు పరిచయం చేశారు. ఉదయ్ కిరణ్ మొదటి సినిమా ‘చిత్రం’ సూపర్ హిట్. ఆ తరువాత వీరి కాంబోలో వచ్చిన ‘నువ్వు నేను’, ‘ఔనన్నా కాదన్నా’ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. ఇక ‘అహింస’ సినిమాలో ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు తనయుడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రేమ, యాక్షన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో రజత్ బేడీ, గీతిక, సదా, రవికాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్ తదితరులు నటించారు. ఆర్.పి. పట్నాయక్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా జూన్ 2న రిలీజ్ కానుంది.