Blakrishna: బాలయ్య 108వ సినిమాలో అర్జున్ రాంపాల్!

  • షూటింగు దశలో బాలయ్య 108వ సినిమా
  • కథానాయికగా అలరించనున్న కాజల్  
  • దర్శకత్వం వహిస్తున్న అనిల్ రావిపూడి 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న తమన్ సంగీతం
  • దసరాకి సినిమా విడుదల
Arjun Rampal in Balakrishna Movie

బాలయ్య 108వ సినిమా సెట్స్ పై ఉంది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాకి, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నటించనున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆ పాత్రకి అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు. ఈ సినిమా షూటింగులో ఆయన జాయిన్ అవుతున్నాడు. 

తాజాగా ఆయనకి వెల్ కమ్ చెబుతూ ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలింది. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే అది విలన్ పాత్రేనా .. లేదా అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది.

బాలయ్య సరసన నాయికగా ఈ సినిమాలో కాజల్ సందడి చేయనుంది. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో తన మార్క్ కామెడీ తక్కువగా ఉంటుందనీ, బాలయ్య మార్కు యాక్షన్ ఎక్కువగా ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పిన సంగతి తెలిసిందే. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News